ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్ఆర్ యంత్రసేవా పథకాన్ని పార్వతీపురంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర ఈ రోజు ప్రారంభించారు. లబ్ధిదారులకు యంత్రాలను పంపిణీ చేశారు. రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి,మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను మెగా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీపురం పట్టణం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన వై. ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు& గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర . అనంతరం నియోజక వర్గాల వారీగా లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం రాజన్నదొర చేతులు మీదుగా వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. రైతన్నకు ఇలా ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ ‘ వ్యవసాయాన్ని పండగ’ గా మార్చిన మన జగనన్న ప్రభుత్వమని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి ,పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి.జోగారావు , శ్రీకాకుళం ఎమ్మెల్సీ పాలవలస.విక్రాంత్ ,జడ్పీ వైస్ చైర్మన్ కె.సింహాచలం ,పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ , పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాధ్ , ఏఎంసీ చైర్మన్లు,డైరెక్టర్లు,వ్యవసాయ శాఖా అధికారులు, లబ్ధిదారులు,రైతులు పాల్గొన్నారు.