రైతులు విత్తు నాటే దశ నుంచి పంట కోసి, దానిని విక్రయించే వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తగిన సహకారం అందిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని ఏపీలోని గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా 3800ల ట్రాక్టర్లతో సహా ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,262 రైతుల గ్రూపులకు వారి బ్యాంక్ ఖాతాలలో రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేశారు.