నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో ఓ బుల్లెట్ ట్రైన్ శనివారం ప్రమాదానికి గురైంది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని గుయాంగ్ నుండి గ్వాంగ్జౌకు ఆ రైలు ప్రయాణిస్తోంది. పట్టాలపై బురద, రాళ్లు ఉండడంతో డ్రైవర్ యాంగ్ యోంగ్ అప్రమత్తమయ్యాడు. కేవలం 5 సెకన్లలో ట్రైన్ ఆపేశాడు. దీంతో 144 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. అయితే వారిని రక్షించి, తాను ప్రాణాలను కోల్పోయాడు. అతడి ప్రాణత్యాగాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.