ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యకు ఉద్యోగం వస్తే సంతోషించాల్సింది పోయి భార్య చేయిని నరికేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోజల్సా ప్రాంతంలో చోటుచేసుకుంది. రేణు ఖాతున్ అనే మహిళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త షేర్ మహమ్మద్ ఉద్యోగం చేయొద్దని వాదించాడు. అయినా ఆమె వినిపించుకోలేదు.దీంతో ఆమె చేయిని నరికేశాడు. వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బావుంది.