ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇంత మంది విద్యార్థుల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫలితాలు ప్రకటించిన రోజు కంటే మూడు రోజులు ఆలస్యంగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు.