ఆంధ్రప్రదేశ్ లో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో మొత్తం 28 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. మంగళవారం అధికారులు నామినేషన్ల పరిశీలన చేసారు. అయితే సమీక్షలో 13 నామినేషన్లు చెల్లవు అని అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో ఉప ఎన్నికలో బరిలో 15 నామినేషన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు.