ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారుల బృందం మంగళవారం పులివెందులలో పర్యటించింది. పట్టణంలోని వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లను స్వయంగా తనిఖీ చేశారు. పులివెందులలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయి. వీరిద్దరి ఇళ్లకు స్వయంగా వెళ్లిన సీబీఐ అధికారులు పలు అంశాలను పరిశీలించారు.