ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గతగ్గనున్న భారత్ జీడీపీ: ప్రపంచ బ్యాంక్ అంచనానున్న భారత్ జీడీపీ: ప్రపంచ బ్యాంక్ అంచనా

national |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 12:03 AM

రానున్న రోజుల్లో భారతదేశ జీడీపీ తగ్గనున్నదని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7.5 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రపంచ ఆర్థిక పరిణామాల తాజా నివేదికలో పేర్కొంది. ఇంతకుముందు భారత్ జీడీపీ 8 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 


ఇదిలావుంటే తాజా ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్-2023 మార్చి)లో భారత్ పట్ల తన అంచనాలను సవరించడం ఇది రెండోసారి. గత ఏప్రిల్ లో భారత్ జీడీపీని 8.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. ఇప్పుడా శాతాన్ని మరికాస్త తగ్గిస్తూ 7.5 గా పేర్కొంది. 2022 ప్రథమార్థంలో భారత ఆర్థిక కార్యకలాపాలను కొవిడ్ సంక్షోభం ప్రభావితం చేసిందని, ఆపై ఉక్రెయిన్ యుద్ధం ప్రతికూలంగా మారిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com