అద్దె ఇళ్లలో ఉంటున్నామని తమకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయించాలని మహిళలు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ని కోరారు.గుంతకల్లు పట్టణంలోని 11 వ వార్డులో మంగళవారం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మహిళలను అడిగి తెలుసు కున్నారు.తమకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని కొందరు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన సచివాల యంలో ఆర్జీ ఇవ్వాలని పరిశీలించి ఇంటి స్థలం మంజూరు చేస్తామని వారికి సూచిం చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, కమీషనర్ బండి శేషన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.