వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ని సిద్ధవటం మండలం లో పురుగు మందులు, ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే వారి లైసెన్స్ రద్దు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి అన్నారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన పురుగుమందులను మాత్రమే అమ్మాలని సూచించారు. ఎక్కువ ధరలు అడిగినట్లు అయితే రైతులు తమ దృష్టికి తేవాలన్నారు.