వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ కేసులో పట్టుబడి, ప్రభుత్వానికి జప్తు చేయబడిన మోటార్ వాహనాలను జూన్ 23వ తేదీన రాజంపేట సబ్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయం వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్ధారించిన ధర నుండి బహిరంగ వేలం వేయడం జరుగుతుందని చిట్వేలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటలో వాహనాలు కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.