NDPL, DPL మరియు నాటు సారా కేసుల్లో సీజ్ చేసిన రూ. 2,22,223/- విలువ చేసే మద్యంను రాప్తాడు పోలీసులు ధ్వంసం చేసారు. అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసులు,డి.టి.సి డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో రాప్తాడు పోలీసులు మరియు సెబ్ పోలీసులు ధ్వంసం (destruction) చేశారు. 54 NDPL, DPL, నాటు సారా కేసుల్లో సీజ్ చేసిన కర్నాటక, ఇతర రాష్ట్రాల మద్యం & నాటు సారాను స్థానిక నడిమివంక వద్ద రోడ్డు రోలర్ ద్వారా నేల మట్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి, సెబ్ అధికారులు,రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.