మూడేళ్లలో సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని, అందుకే ఈ రోజు కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్‌షాప్ ప్రారంభమైంది. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని సీఎం వైయస్ జగన్ అన్నారు. దాదాపు 8 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయించాలని సూచించారు. నెలలో 20రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకూ కార్యక్రమం చేపట్టాలన్నారు. గడప గడపకూ కార్యక్రమంపై నెలకోసారి వర్క్‌షాప్ నిర్వహిస్తామని చెప్పారు. వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై వర్క్‌షాపులో చర్చిస్తామని తెలిపారు. మనకు ఓటు వేయనివారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామని సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం చెప్పారు.