కుమార్తె సహా తల్లి అదృశ్యమైన ఘటన తెనాలి లో చోటుచేసుకుంది. పట్టణయడ్ల లింగయ్య కాలనీకి చెందిన కొండా రాణి తన ఆరేళ్ల కుమార్తె ఐశ్వర్య తో కలిసి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో భర్త జయపాల్ పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ ఎస్ ఐ వి. కలగయ్య మంగళవారం రాత్రి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.