సామర్లకోట మండలం పరిధిలో వివిధ గ్రామాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న లే అవుట్ లలో లబ్ధిదారులు ఇల్లు త్వరితగతిన నిర్మినిచుకునేలా మండల పరిధిలో అన్ని శాఖల అధికారులు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని కాకినాడ ఆర్డీవో బీవీ. రమణ కోరారు. సామర్లకోట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులు తో ఆర్డీవో రమణ సమీక్షించారు. ఈ సమావేశం లో హౌసింగ్ ఈఈ గుప్తా ఏఈ శ్రీనివాసు, వివిధ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.