కొలిమిగుండ్ల మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ సున్నపురాయి తవ్వకాల కోసం బుధవారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభలో రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుందా అన్న కోణంలో ముందస్తుగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం పట్ల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.