ఓర్వకల్లు మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన పక్కిరి అల్లాబకాష్ కుమారుడు మహబూబ్ బాషా(45) అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ మల్లికార్జున తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్ బాషా సోమవా రం ఉదయం టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడని అర్ధరాత్రి గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికగా అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతోమంగళవారం అతని భార్య ఫరీదా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తప్పిపోయిన మహబూబ్ బాషా నల్లటి ఆఫ్ షర్ట్, కలర్ లుంగీ ధరించినట్లు చెప్పారు. ఎక్కడైనా అతని ఆచూకీ తెలిస్తే ఓర్వకల్లు ఎస్సై 9121101067 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.