కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన చూడి గోవిందు రాజులు, చూడి శారదమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి పది గంటలకు తన భర్త బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో గమనించిన తలారి హనుమేష్, ఫ్వాతప్ప, కిష్ణ మూర్తి లు ముగ్గురు కలిసి ఇంటి బయట నిద్రిస్తున్న తన తండ్రిని కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో బట్టలు కుక్కి నా పై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు శారదమ్మ కన్నీటి పర్యంతము అయ్యింది. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి తన తండ్రిని కట్టేసి, నా రూం లోకి వచ్చి, తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడితే ఆ దేవుణి దయవల్ల వారి నుంచి తప్పించుకుని తలుపులు తీసి బయటకు వచ్చానని ఆమె తెలిపారు. బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు పారిపోయారని బాధితురాలు వాపోయింది. దీంతో రాత్రి పదుకొండు గంటలకు కోసిగి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసి తమ గ్రామానికి వెళ్ళామన్నారు. మా పైనే పోలీస్టేషన్లో కంప్లైంట్ చేస్తారా అంటూ నా పై అత్యాచార యత్నానికి పాల్పడిన వారిలో ఒకరైన ప్వాతప్ప కుటుంబ సభ్యులు తమ ఇంటికి వచ్చి నన్ను, నా బార్త గోవిందురాజులను దాడి చేశారని బాదితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని తన పై అత్యాచార యత్నానికి పాల్పడిన ఆ ముగ్గురు పై కేసు నమోదు చేయాలని బాధితురాలు చూడి శారదమ్మ మిడియా ముందు వాపోయింది.