బనగానపల్లె పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో దొరకోట సమీపంలో అత్తార్ హమీద్ హుస్సేన్‌కు చెందిన రెండు దుకాణాలను కూల్చివేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శంకర్‌నాయక్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న అత్తార్హమీద్ దొరకోట వద్ద ఉన్న తన సొంత స్థలంలో బనగానపల్లె గ్రామ పంచాయతీ అనుమతితో 8 దకాణాలు నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఫిదాహుస్సేన్తో పాటు మరో 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎక్స్‌కవేటర్‌తో వచ్చి రెండు దుకాణాలను ధ్వంసం చేనినట్లు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనలో ఫిదాహుస్సేన్తో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.