జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో బాల బాలికలకు నిర్వహించిన ఆర్చరీ సమ్మర్ క్యాంపు బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డా. శంకర్శర్మ హాజరై క్యాంపులో విలువిద్యలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. క్రమశిక్షణతో భవిష్యత్ క్రీడల్లో రాణించవచ్చని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ రమణ, డీఎస్ఏ చీఫ్ కోచ్ భూపతిరావు, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, వంశీ, భరత్, బాలాజి పాల్గొన్నారు.