ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసేందుకు 70వేల పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉంచినట్లు ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. మండలంలో 92 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 1.40 లక్షల పుస్తకాలు అవసరం కాగా, 70 వేల పుస్తకాలు చేరాయి. దుర్గాన్న, రంగన్న, జయన్న, కాసిం, తదితరులు పాల్గొన్నారు.