ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:34 PM

ఆళ్లగడ్డ పట్టణంలో ఓ వివాహిత రాత్రి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం పట్టణ పోలీసుల కథనం మేరకు. సిరిసిల్ల మండలం గోయిందపల్లే గ్రామానికి చెందిన మౌనికకు 12 ఏళ్ల కిత్రం ఆళ్లగడ్డకు చెందిన జ్ఞానరవితో వివాహమైంది. మౌనిక కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. గోవిందపల్లె ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా ఆమెకు కడుపునొప్పి తగ్గలేదు. దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com