భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ భర్త చేతిని నరికేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. కోజల్సాకు చెందిన రేణు నర్సు ఉద్యోగం సాధించడంతో ఆమె భర్త వద్దన్నాడు. వేరే ఊరికి వెళ్లి పనిచేయడం తనకు నచ్చదని భార్యచేతిని నరికేశాడు. అయినా కూడా ఆమె తన పట్టుదల విడవలేదు. కుడి చేయి పోయినా ఇంకో చేత్తో రాయడం ప్రాక్టీస్ చేస్తోంది. కష్టపడి చదివి సాధించిన ఉద్యోగాన్ని మాత్రం చేసి తీరుతానని వైద్య చికిత్స పొందుతూనే ప్రాక్టీస్ చేస్తోంది.