పదవ తరగతి ఫలితాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాధిత విద్యార్థులతో కలిసి కర్నూలు డీఈఓ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని అన్నారు. పది పరీక్షలు ఫలితాలపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈవో రంగారెడ్డికి వినతిపత్రం అందించారు.