పెనుకొండ - మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న పెద్దమంతురు సమీపములో ఉన్న పెన్నానది పై ఉన్న బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్న18చక్రాల ట్రాలీ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి బ్రిడ్జి పైనుండి పెన్నానది లోకి పడిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. అందులో కేబుల్ లైన్ కు సంబంధించిన లోడుతో వెళుతున్నట్లు వారు తెలిపారు. డ్రైవరుకు తలకు స్వల్పంగా గాయాలు అయినట్లు తెలిపారు.