విజయనగరం జిల్లా కేంద్రంలోని వసంత విహార్లో శ్రీలక్ష్మి పౌల్ట్రీ ఆఫీసులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంచార్జి డిఎస్పీ త్రినాధ్ వివరాలు వెల్లడించారు. జూన్4న రాత్రి శ్రీలక్ష్మి పౌల్ట్రీ కార్యాలయంలో బీరువా తాళాలు పగులగొట్టి రూ. 6. 8 లక్షలు నగదును దొంగిలించుకుపోయారు. ఒకటవ పట్టణ పోలీసులు 24 గంటల వ్యవధిలో చోరికి పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి రూ. 6. 7 లక్షల నగదు రికవరీ చేసి, రిమాండుకు తరలించామని ఇంచార్జి డిఎస్పీ శ్రీ టి. త్రినాథ్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిఐ జే. మురళి, ఎస్ఐ అశోక్, హెచ్ సి అచ్చిరాజు, కానిస్టేబుల్ శివకుమార్ లను అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులను డిఎస్పీ అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa