నల్లమల అటవీ ప్రాంతానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ.. సెప్టెంబరు 2వ తేదిన హెలికాఫ్టర్ ప్రమాదంలో నల్లమల అటవీ ప్రాంతంలోని పావులరాలగుట్టలో మృతిచెందడం అందరికి తెలిసిన విషయమే.
అయితే ఆయన జ్ఞాపకార్థం అప్పట్లో ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ సమీపంలో ఆత్మకూరు - నంద్యాల రహదారి పక్కన స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 16ఎకరాల్లో దాదాపు రూ.13కోట్ల వ్యయంతో వైఎస్‌ఆర్ సృతివనాన్ని నిర్మించి 2012 జూలై 8న వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రారంభించారు.
అప్పటి నుంచి వైఎస్‌ఆర్ సృృతివనం ఆత్మకూరు అటవీశాఖ నిర్వహణ సాగిస్తోంది. ఈ సృృతివనంలో సుగంధవనం, పవిత్రవనం, బట్టర్ ఫ్లై గార్డేన్, పర్యావరణ విజ్ఞాన కేంద్రం, థియేటర్, చిల్డ్రన్ గార్డెన్ తో పాటు 33 అడుగుల నిలువెత్తు వైఎస్‌విగ్రహాన్ని నెలకొల్పి విగ్రహం చుట్టూ వాటర్‌ఫౌంటేన్స్‌ను ఏర్పాటు చేశారు.
అలాగే సుగంధవనం, పవిత్రవనంలో అరుదైన 120 రకాల ఔషదమొక్కలు వాటి వివరాలతో కూడిన బోర్డులను పొందుపరిచారు. ప్రత్యేకించి 70 అడుగుల ఎత్తులో వ్యూటవర్‌ను నిర్మించి అక్కడి నుంచి టెలిస్కోప్ ద్వారా నల్లమలలోని పావురాలగుట్ట ప్రదేశంతో పాటు చుట్టూ వున్న నల్లమల అందాలను వీక్షించే వెసులుబాటు కల్పించారు.
కాగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు సందర్శకులకు ప్రవేశ అనుమతులు కల్పించారు. సాయంత్రం పర్యావరణంపై ఉచిత థియేటర్ ప్రదర్శన, రాత్రి సమయంలో లైటిగ్‌షోలను నిర్వహిస్తున్నారు. ఇవేకాకుండా సందర్శకుల కోసం స్మృతివనం ప్రదేశమంతా గ్రాస్‌గ్రీనరీని ఏర్పాటు చేసి అక్కడక్కడ విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు.
అలాగే మినరల్‌వాటర్, పార్కింగ్ సదుపాయం, రెస్టారెంట్‌లు కూడా అందుబాటులో వుంచారు. అదేవిధంగా పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటవస్తువులను అందుబాటులో వుంచారు. అన్నివిధాలుగా గ్రీనరీని సొంతం చేసుకున్న వైఎస్‌ఆర్ సృృతివనాన్ని 84 మంది సిబ్బందిచే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సాగిస్తుంటారు.
ప్రతినెల సుమారు 2వేల మందికిపైగా సందర్శికులు స్కృతివనానికి వస్తుంటారు. పర్వదినాల సమయంలో వేలాది మంది తరలిస్తారు. ప్రత్యేకించి శ్రీశైలం - మహానంది మీదుగా వెళ్లే పర్యాటకులు వైఎస్‌ఆర్ సృృతివనాన్ని సందర్శించి మధురానుభూతిని పొందుతున్నారు. 2018లో వైఎస్‌ఆర్ సృృతివనం ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌అవార్డు దక్కించుకుంది.
సృతివనంలో రుసుముల వివరాలు
నిర్దేశించిన సమయాల్లోనే స్కృతివనంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా సృృతివనానికి వెళ్లాలంటే పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 చొప్పున రుసుము నిర్ధేశించారు. అదేవిధంగా టూవీలర్, ఆటోలకు రూ.10, ఫోర్‌వీలర్స్‌కు రూ.20 రుసుము నిర్ధేశించారు. అంతేకాకుండా స్కృతివనంలో ఫోటోలు దిగాంటే కెమెరాకు రూ.100, వీడియో కెమెరాకు రూ.500 చొప్పున రుసుము చెల్లించాల్సి వుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa