భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా జడేజా తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారు. తమ కూతురు నిద్యానా పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం 101 మంది ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేశారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.11 వేలు డిపాజిట్ కూడా చేశారు. ఈ విషయాన్ని జడేజా దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. చాలా మంచి పనిచేశారంటూ వారిని అందరూ అభినందిస్తున్నారు.