'ఓట్స్'లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో కండరాలు, ఎముకలు పటిష్టంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీనిలోని సిలికాన్ అనే ఎంజైమ్ జుట్ట రాలకుండా సాయపడుతుంది. ఫైబర్ అధిక మోతాదులో ఉండడంతో మలబద్ధకం సమస్య దరికి రానీయదు. త్వరగా కడుపు నిండిన భావన కల్పించి, బరువు తగ్గేందుకు సాయపడుతుంది.