బీహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో మంగళవారం కదులుతున్న బస్సులో ఓ బాలిక(17)పై సామూహిక అత్యాచారం జరిగింది. బెట్టయ్య ప్రాంతానికి వెళ్లడానికి బస్ కోసం చూస్తున్న బాలికను బస్ డ్రైవర్ బస్ ఎక్కించుకున్నాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో బాలిక స్పృహ తప్పింది. అనంతరం ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్ సహా మరొకర్ని పోలీసులు అరెస్టు చేశారు.