మంకీపాక్స్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. శృంగారం వల్లే మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. ఈ వైరస్ సోకిన వారు ఇతరులతో శారీరకంగా కలిస్తే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.