ఏపీలోని ఏలూరు జిల్లాలోని జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి అలేఖ్య (24) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవితేజ అనే యువకుడితో అలేఖ్య ప్రేమలో ఉందని తెలిసి పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. ఈనెల 9న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లి చెడగొట్టాలని అలేఖ్యతో తాను తీసుకున్న ఫోటోలను రవితేజ వరుడికి పంపాడు. దీంతో అలేఖ్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.