టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారిని రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. 'కంపార్టుమెంటల్ పాస్' ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని నిర్ణయించింది.
మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. సప్లిమెంటరీ రాసే వారికి ఈ నెల 13 నుంచి ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు.