తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బుధవారం మంటల్లో కాలిపోయింది. ఆ బైక్ నడిపే వ్యక్తి బైక్ వేడెక్కడాన్ని గమినించి వెంటనే రోడ్డు పక్కన బైక్ ను ఆపేశాడు. ఈ క్రమంలో బైక్‌లో మంటలు చెలరేగాయి. బైక్‌పై నీటిని పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఈ బైక్ ను రెండేళ్ల క్రితం కొన్నట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.