బీహార్‌లోని ససారమ్ ఆసుపత్రికి బుధవారం ఓ కోతి తన పిల్లతో కలిసి వచ్చింది. డాక్టర్ వచ్చేంత వరకు ఎదురు చూసింది. కాసేపటికి ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ అహ్మద్ ఆ కోతి ముఖానికి గాయమైందని గమనించారు. దాని గాయం తగ్గడానికి ఇంజక్షన్ చేసి, ఆ తర్వాత ఆయింట్మెంట్ పూశారు. కొద్ది సేపు పేషెంట్ల బెడ్‌పై రెస్ట్ తీసుకున్న ఆ కోతి గాయం నొప్పి తగ్గాక తన దారిన తాను వెళ్లిపోయింది. ట్విట్టర్లో పెట్టిన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.