కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నిత్యఅన్నదానికి తిరుపతి జిల్లా కు చెందిన దాత నవీన్ కుమార్ రెడ్డి రూ. లక్ష 116 రూపాయల చెక్కును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. పర్యవేక్షకులు కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, తదితరులు ఉన్నారు.