చిత్తూరు జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబoధితశాఖలు చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ యం. హరి నారాయణన్ సంబంధింత శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తీసుకోవలసిన చర్యల్లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యల పై వ్యవ సాయ, హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బి, విద్య, సమగ్ర శిక్ష, వైద్య, ఐ సి డి ఎస్, డ్వామా, ఎల్ డి ఎం సంబం ధిత అధికారులతో సమీక్షించారు.