సుమారు ₹15 లక్షల విలువైన వెండి వస్తువులను రాజమండ్రి జిఆర్పి, ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే. స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ వద్ద ఏ విధమైన బిల్లులు లేకుండా రవాణా కు సిద్ధంగా ఉన్న సుమారు 25 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెండి వస్తువులను రాజమండ్రి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించారు.