పర్యావరణానికి సమస్యగా మారిన ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు జులై నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించబోదని పుదుచ్చేరి ఆర్థికశాఖ అండర్ సెక్రటరీ అర్జున్ రామకృష్ణన్ ప్రకటించారు. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ జండాలు, ప్లాస్టిక్ షీట్లు వంటి 17 రకాలు వస్తువులను పుదుచ్చేరి ప్రభుత్వం నిషేధించినందున ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలు వాటిని వినియోగించరాదని రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్ణయం తీసుకొందన్నారు. సదరు నిషేధిత వస్తువులను ఎవరైనా కొనుగోలు చేస్తే దానికి సదరు అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందని, నగదు తానే భరించాల్సి ఉంటుందన్నారు.