రైతు సంక్షేమమే ధ్యేయంగా సి.ఎం జగన్ పాటుపడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. నియోజకవర్గంలో దాదాపు 25 ట్రాక్టర్లను అందించారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్, ఏ. డి. ఏ లు కృష్ణదేవరాయలు, తిరుమలాదేవి, ఉషారాణి, వేమూరు వ్యవసాయ అధికారి బాలాజీ గంగాధర్ ఐదు మండలాల ఏవో లు, పార్టీ నాయకులు ఏడుకొండలు, ఎం పీ పీ వై మోహన రావు, పాల్గొన్నారు.