ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయడం జరుగుతుందనిరాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార, పౌర సంబంధాలుసినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గ్రామ సచివాలయాలు ద్వారా అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార, పౌర సంబంధాలుసినిమాటోగ్రఫీ శాఖా మంత్రిచెల్లుబోయినశ్రీనివాస్, వేణుగోపాల కృష్ణ తెలిపారు.
గురువారం రామచంద్రపురం పట్టణంలో గుల్ల వారి పేట గ్రామ సచివాలయం 11, వార్డు నెంబర్ 26, 27 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమంసమాచార, పౌర సంబంధాలు; సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులతో మాట్లాడి పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రివేణుగోపాలకృష్ణసూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.