ప్లాస్టిక్ నిషేధానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నగర పంచాయతీ కమిషనర్ జి లోవరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ నేల, నీరు వాయు కాలుష్యంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలన్నారు కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటుచేసిన కళాజాత ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు.