నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లోని ప్రసూతి కేంద్రంలో కాన్పు అనంతరం గర్భిణి మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరుకు చెందిన మానస అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత ఆమెకు అధికంగా రక్తస్రావం కావడంతో అవసరమైన చికిత్సను అందజేశారు. ఈ క్రమంలో ఆమె మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని భర్త మహేష్ ఆరోపించారు. దీనిపై ఉన్నత అధికారులు ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa