వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ గెలిస్తే టీడీపీ ఆఫీసుకు తాళం వేస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం అన్నారు. ఈ విషయంలో వైసీపీ సామర్థ్యంపై జగన్‌కు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. ఒక వేళ ఏ మాత్రం ఉన్నా ఇప్పుడే మధ్యంతర ఎన్నికలకు పిలుపునివ్వాలని సవాల్ విసిరారు. టెన్త్ స్టూడెంట్ల కోసం లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే దొంగల్లా అందులోకి వైసీపీ నేతలు దూరారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa