ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫ్యాన్సీ నంబర్ల బేసిక్ ఫీజును భారీగా పెంచుతూ ఏపీ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్లకు జరిగే వేలంలో పాల్గొనే వారు రూ.5 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఆ రుసుమును రూ.2 లక్షలకు పెంచుతూ రవాణా శాఖ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టాన్ని ఉటంకిస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారు రూ.5 వేలకు బదులు రూ.2 లక్షల ప్రాథమిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.