--- షూ లేసులకు చివరలో ఉండే చిన్న ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. వాటినేమంటారో తెలుసా... అగ్లెట్స్.
--- కొన్ని పెన్సిళ్లకు చివరన ఎరేజర్ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ కలుపుతూ ఉండే మెటల్ తొడుగును ఫెర్రుల్ అంటారు.
--- చేతి గడియారం...అదేనండి వాచీ టైం సరిగా చూపించకపోతే ఒక చిన్న నాబ్ ను తిప్పి కరెక్ట్ టైం ను సెట్ చేసుకుంటాం కదా...ఆ నాబ్ ను క్రౌన్ అంటారు.
--- చొక్కాలకు వెనకవైపు ఒక చిన్న లూప్ ఉంటుంది. దీని సాయంతో చొక్కాలను గోడకుండే మేకులకు వేలాడదీయొచ్చు. వీటిని లాకర్ లూప్ అంటారు.