ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ పేషేంట్స్ కు సమ్మర్ మాక్ టైల్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 10:24 PM

కావలసిన పదార్థాలు : పైనాపిల్ - 1, పుచ్చకాయ - సగం ముక్క, మామిడికాయ - 1, ఐస్ క్యూబ్స్ - కొన్ని. 


తయారీవిధానం: 


-- ముందుగా పైనాపిల్ ను బాగా శుభ్రం చేసి, పై తొక్కు తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 


-- పుచ్చకాయను కూడా పై చెక్కు తీసేసి, చిన్న ముక్కలుగా కోసి పక్కన పట్టుకోవాలి. అలానే గింజలు లేకుండా చూసుకోవాలి.  


-- మామిడిపండు ను తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి. 


-- ఇప్పుడు ఈ మూడు రకాల పండ్ల ముక్కలను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, వాటికి ఒక గ్లాస్ మంచి నీళ్లను జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 


-- సర్వింగ్ గ్లాస్ తీసుకుని రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని మిక్సీ జార్ లోని జ్యూస్ ను ఇందులో పోసుకుని తాగండి. అంతే షుగర్ లెస్ మాక్ టైల్ రెడీ. 


-- ఎండాకాలంలో షుగర్ తో నిండిపోయిన జ్యూస్ లను తాగలేక ఇబ్బంది పడుతున్న షుగర్ పేషేంట్స్ కు ఈ మాక్ టైల్ ఇవ్వండి. వాళ్ళెంతో ఆనందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com