మనం ఎంతో అపురూపంగా చూసుకునే జుట్టుకు ఆ షాంపూలు, ఈ కండీషర్లు, హెయిర్ ప్యాక్ లు అంటూ కెమికల్స్ తో నిండిన, మార్కెట్లో దొరికే ఉత్పత్తులను వాడేకన్నా, సహజసిద్ధంగా దొరికే పదార్థాలతో ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకున్న వాటిని వాడటం ఎంతో ఉత్తమం. మనకు ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువు కరివేపాకు. దీంతో డామేజ్ ఐన జుట్టును తిరిగి మంచి కండిషన్ లోకి తీసుకురావచ్చు. అదెలానో చూద్దామా.
సరైన పోషణ లేక ఫుల్లుగా డామేజ్ ఐన జుట్టును ఆరోగ్యంగా మార్చటానికి కరివేపాకుతో తయారుచేసిన ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ దగ్గర కరివేపాకు, మెంతులు, నిమ్మకాయ, పెరుగు, కొబ్బరి నూనె ఉంటె సరిపోతుంది.
గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ మెంతులు, ఒక చెక్క నిమ్మకాయ రసం మిక్సీ జార్ లోకి తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చెయ్యండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొద్దిగా పెరుగు, కొద్దిగా కొబ్బరి నూనె ను జోడించి మెత్తని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని బాగా ఆరిన తర్వాత మీరు తరచూ వాడే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వారినికొకసారైనా ఇలా చేస్తే డామేజ్ ఐన జుట్టు కండిషన్ లోకి రావడమే కాదు, జుట్టు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.