అనుమానంతో భార్యను భర్త చంపేసిన ఘటన చీమకుర్తిలో గురువారం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లాకి చెందిన జయరావు, ఆండ్రా పరిశుద్ధం దంపతులు 20 రోజుల క్రితమే గరకమిట్టలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యపై అనుమానంతో అజయ్ తరచూ గొడవపడేవాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యను అజయ్ కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.