పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడానికి సిగ్గులేదా జగన్ రెడ్డి? అన్న క్యాంటీన్లు మూసేశారు అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరిలో తాజాగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ విషయంపై మాట్లాడుతూ... మేం పేదలకు భోజనం పెడతామంటే ఒప్పుకోరు. మంగళగిరిలో పేదలకు రూ.2 కే భోజనం అందించడానికి ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ కి అనుమతి లేదంటూ జగన్ రెడ్డి సర్కార్ కూల్చేయడం అత్యంత హేయమైన చర్య. అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఖాయం. పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తాం. ఎవడు అడ్డొస్తాడో చూస్తాం అని ధీమా వ్యక్తపరిచారు.